నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్ : బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్ విషయాల్లో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నారు. గత నవంబర్ నుంచి శిక్షణ కొనసాగుతున్నట్టు సమాచారం.  పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలి సినిమా రావచ్చనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరి దర్శకత్వంలో ఉండొచ్చనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. బాలయ్యతో ‘అఖండ 2’కు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ కోసం ఓ ప్రత్యేక పాత్రను ఆయన రెడీ చేసినట్టు చెపుతున్నారు. ఇది ఎంత వరకు వాస్తవమో అధికారికంగా తెలియాల్సి ఉంది.

Spread the love