ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పున: ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడ డివిజన్‌ పరిధిలో, నిడదవోలు- కడియం సెక్షన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతుండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రజలకు సౌకర్యంగా ఉండే రైళ్లను రద్దు చేయడం పట్ల ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25 నుంచి ఇది వరకు నడిపిన సమయాలకు అనుగుణంగానే నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా నిర్ణయం తీసుకుంది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు విజయవాడ-కాకినాడ పోర్టు, చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Spread the love