నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని, దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది. రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేయనుంది.