తిరుమల వాసులకు శుభవార్త..

నవతెలంగాణ – తిరుపతి: తిరుమల వాసులకు శుభవార్త.. తిరుమలలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఏపీ రోడ్లపై తొలిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టింది. తిరుపతి రోడ్లపై దీన్ని తిప్పారు. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తెలిపారు. ఏఏ మార్గాల్లో నడపాలి అనేది ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. రూ. 2 కోట్లతో బస్సును కొనుగోలు చేయగా మూడు గంటలు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నడవనుంది.

Spread the love