రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. త్వరలోనే వన్డే, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కూడా ఆయన తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ అంశంపై రోహిత్ స్పందించాడు. తాను ఇంకొంత కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడే ప్రణాళికలు తన వద్ద లేవని చెప్పాడు. అమెరికాలోని డాలస్ లో ఒక క్రికెట్ అకాడెమీ ప్రారంభోత్సవానికి రోహిత్ వెళ్లాడు. ఈ సందర్భంగా రోహిత్ రిటైర్మెంట్ పై అక్కడి అభిమానులు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ… తన రిటైర్మెంట్ వస్తున్న ఊహాగానాలకు రోహిత్ తెరదించాడు.

Spread the love