సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు శుభవార్త..

For Singareni employees Payment of arrearsనవతెలంగాణ-హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థ లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను లాభాల్లో ఉద్యోగులకు 32 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32 శాతం వాటా చెల్లించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డుస్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700 కోట్లకు పైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం చెప్పారు.

Spread the love