నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే మరుసటి రోజు కూడా పలు జిల్లాల్లో సెలవు ఉండనుంది. ఎందుకంటే 27న తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ లో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కర్నూలు, వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. ఇందుకు సబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.