నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభం అయ్యాయి. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులు పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. అటు తెలంగాణలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది. డిసెంబర్ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ కాగా.. డిసెంబర్ 26న బాక్సింగ్ డే కావడంతో ఈ రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. ఏపీలో రేపు పబ్లిక్ హాలీడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.