శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి గుడ్ న్యూస్.. శబరిమల అయ్యప్ప దేవాలయం ఇవాళ ఓపెన్ కానుంది. ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప దేవాలయం రెండు నెలల పాటు జరిగే మండల తీర్థయాత్ర కోసం ఇవాళ సాయంత్రం తెరుచుకుంది. సాయంత్రం 5 గంటలకు తంత్రి కాంతారావు మహేష్ మోహనరావు గర్భాలయాన్ని ప్రారంభించారు.  దీంతో నూతనంగా ఎన్నికైన ప్రధాన అర్చకులు పిఎన్ మహేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన అర్చకుడు కే. జయరామన్ నంబూతిరి బంధువు మృతి కారణంగా పూజలకు హాజరు కావడం లేదు. ఈసారి ఆలయ ప్రవేశద్వారంలో ఏర్పాటు చేసిన రాతి స్తంభాలు భక్తుల మనసు దోచుకోనున్నాయి. నిర్మాణంలో ఉన్న హైడ్రాలిక్ పైకప్పులో స్తంభాలు ఒక భాగం. హైదరాబాదు కు చెందిన విశ్వసముద్రం అనే నిర్మాణ సంస్థ అయ్యప్ప స్వామికి కానుకగా పైకప్పును నిర్మిస్తోంది. ఈ ప్రా జెక్టు కోసం కంపెనీ దాదాపు రూ. 70 లక్షలు కేటాయించినట్లు మీడియా సమాచారం.

Spread the love