నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ఆయన కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్ననే ముగసిందని అన్నారు. ఇక  కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ స్టార్ట్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

Spread the love