యూపీఐ పేమెంట్లు చేసే వారికి శుభవార్త

నవతెలంగాణ – హైదరాబాద్: కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి రూ.5లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి(సెప్టెంబర్ 15) నుంచి అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయానికి RBI ఆమోదం తెలపగా, తాజాగా NPCI ఇందుకు అనుమతిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులు, IPO దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు యూపీఐ ద్వారా ఒకేసారి రూ.5లక్షల చెల్లింపులు చేయవచ్చు

Spread the love