తిరుమల భక్తులకు శుభవార్త.. కొత్తగా 1,500 ఎలక్ట్రిక్ బస్సులు

నవతెలంగాణ- తిరుపతి: తిరుపతి సర్వీసులకు 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఇప్పుడు జిల్లా కేంద్రాలు, పట్టణాలకు సేవలను విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సంస్థ కన్వర్జేన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ బాగాస్వామ్యంతో 1,500 బస్సులను కొనుగోలు చేయనుంది. ఒక్కో బస్సుకు రూ. కోటి చొప్పున 1500 కోట్ల బడ్జెట్ ను ఆమోదించనుంది. ఎలక్ట్రిక్ బస్సులతో నిర్వహణ వ్యయం 27% తగ్గుతుందని అంచనా. కాగా, టీటీటీడీ శిల్పకళాశాలలో మూడు రోజుల సెమినార్ ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి. కళంకారీ రాష్ట్ర కళగా ప్రకటింపచేస్తానని 30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైనదని వెల్లడించారు.

Spread the love