నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఈ రోజు డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 5089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టో బర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత ఉమ్మడి జిల్లాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు ఎలాగైనా జాబ్ కొట్టాలని చాలా కష్టపడుతున్నారు. ఎన్నికలు వచ్చే లోపే ఈ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Spread the love