పింఛనుదారులకు శుభవార్త..

నవతెలంగాణ – అమరావతి: ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ, ప్రథమ కర్తవ్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. అందుకే పెంచిన పింఛన్ ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తాజాగా జులై 1న రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4000 ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు రూ.3000 పెంచి ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మూడు నెలలకు పెంచిన రూ.3000, జులై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు.

Spread the love