ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’ హిందీ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞ్రన్ విలన్‌గా నటించటం ఓ విశేషమైతే, సైకో పాత్రలో ప్రజ్ఞన్ అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించడం మరో విశేషం. తన పాత్రకు వస్తున్న గుర్తింపు గురించి ప్రజ్ఞన్ మాట్లాడుతూ, ‘ఇందులో చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్నివేశాలకు చక్కటి ప్రశంసలు వచ్చాయి. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి సైకోగా చాలా బాగా నటించావని ప్రశంసించారు. ఈ సినిమా చూసిన వెంటనే ఓ ప్రముఖ హీరో నటిస్తున్న తెలుగు సినిమాలో దర్శకుడు శ్రీని అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.