మనం వంటల్లో ఉల్లిగడ్డలను, ఉల్లికాడలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లి వేస్తే కూర రుచిగా ఉంటుంది. ఇక వేసవికాలంలోనైతే దీని విలువ చెప్పనవసరం లేదు. వంటల్లోనే కాక విడిగా పచ్చి ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఎక్కువగానే తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మండే ఎండల్లో వడదెబ్బ నుండి రక్షణకు పిల్లల మెడలో ఉల్లిగడ్డలను మాలగా గుచ్చి వేస్తారు. పెద్దవారైతే ఎండలో బయటికి వెళ్ళాల్సివచ్చినప్పుడు ఉల్లిగడ్డను తలపై ఉంచుకుని టోపీ పెట్టుకుంటారు. అలాగే చిన్నపిల్లల్లో, పెద్దవారిలో నిద్రలేమిని ఇట్టేమాయం చేసే ఉల్లి ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.
ముక్కులో నుండి రక్తం కారుతుంటే తెల్ల ఉల్లిగడ్డను మధ్యలోకి కోసి కాసేపు వాసన చూస్తే సరి.
మొటిమలు, వాటి తాలూకు మచ్చలకు ఉల్లిగడ్డ రసం, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలుపుకున్న మిశ్రమం చక్కని ఔషధం.
చుండ్రు సమస్య వేధిస్తుంటే ఉల్లి రసం తలకు బాగా పట్టించాలి. ఇది చుండ్రును మాయం చేయడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది.
మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ఉల్లి రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తేరుకుంటారు.
విషకీటకాలు, కుక్కకాటుకు ఉల్లి రసం తీసుకోవడం లేదా ఉల్లిగడ్డను దంచి గాయంపై పూసినా వెంటనే మంట తగ్గుతుంది. విషాన్ని హరిస్తుంది.
ఎంతగా బాధించే నొప్పులకైనా ఉల్లిరసం, ఆవనూనె సమంగా కలిపి మర్దనచేస్తే చాలు వెంటనే ఉపశమనం దొరుకుతుంది.