గోపాల మిత్రులకు ఆఫీస్‌ సబ్‌ ఆర్డినెట్స్‌గా అవకాశం కల్పించాలి

– గోపాలమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్‌
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
పశుసంవర్ధక శాఖలో గోపాల మిత్రులుగా విధులు నిర్వర్తిస్తూ మూగజీవాలకు సేవ చేస్తున్న వారికి ఆఫీస్‌ సబార్డినేట్స్‌గా అవకాశం కల్పించాలని గోపాల మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్‌ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలో గోపాలమిత్రల ముఖ్యుల సమావేశ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గోపాల మిత్రులు 1530 మంది విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశానికి రైతు వెన్నెముక అయితే అదే రైతుకు పాడి పరిశ్రమ వెన్నెముక లాంటిదన్నారు. పశుసంవర్ధక శాఖకు 22 ఏండ్ల నుంచి24 గంటలు సర్వీస్‌ అందిస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని లబ్దిదారులకు అందజేయడంలో కీలకపాత్ర వహిస్తున్నట్టు తెలిపారు. కాగా ఇటీవల సీఎం కేసీఆర్‌ గోపాల మిత్రుల వేతనం 8500 నుంచి 11050 రూపాయలకు పెంచారని వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ వెటర్నరీ అసిస్టెంట్‌ గా పరీక్షలలో 30 శాతం మార్కులు వెయిటింగ్‌ వెయిటేజ్‌ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూలేపాక రాములు, ప్రధాన కార్యదర్శి రేగు బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్లంల జంగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Spread the love