బీఆర్ఎస్ కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం.. గోసంగి సంగం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్

నవతెలంగాణ ఆర్మూర్  

బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం,మా డిమాండ్స్ నెరవేర్చే వారికే మా మద్దతు ఇస్తామని గోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్ అన్నారు. పట్టణంలోని అరుంధతి నగర్ గోసంగి సంఘంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో గోసంగి కులస్తులకు అన్యాయం జరిగిందని గతంలో బి.అర్.ఎస్ గెలుపునకు గోసంగి సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసి మద్దతు ఇచ్చామని అయిన గోసంగి లకు పదవుల్లో, సంక్షేమ పథకాల్లో అన్యాయమే జరిగిందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గోసంగి కులస్తులు అత్యంత వెనకబడి ఉన్నారని వారి అభ్యున్నతికి ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కృషి చేయలేదని గతంలో బి అర్.ఎస్ పార్టీకి చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని రద్దు చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో మా గోసంగి డిమాండ్స్ ఎవరైతే నెరవెరుస్తారో వారికే మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, జీ వై ఎస్ అధ్యక్షులు వినోద్, నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర్, మండల అధ్యక్షులు నిరగొండ సాయిలు,, మండల గోసంగి ప్రధాన కార్యదర్శి గంధం చిరంజీవి,ఉపాధ్యక్షులు సుమన్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love