నవతెలంగాణ- రామారెడ్డి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా మండలంలోని ఉప్పల్వాయి ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డిని హైదరాబాదులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రామారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న విజయలక్ష్మిని జిల్లా కేంద్రంలోని కళాభారతిలో శాలువాతో సన్మానించి, ప్రశంస పాత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.