పట్టణంలో గోవర్ధన హారతి

నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని రామ్ భవన్ లో జీ జీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ గీత నివేధన్ గుజరాతి దంపతులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అత్యంత వైబవంగ గోవర్ధన హారతి కార్యక్రమాన్ని ఇస్కాన్ ప్రబుజీ రమానంద్ అధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించినారు. . కీర్తనలు,నేతి దీపాలతో హారతి ,సత్సంగం  ,మహా ప్రసాద వితరణ చేపట్టడం జరిగిందని  లయన్ నివేధన్ గుజరాతి తెలిపారు ఈ సందర్భంగా ప్రబూజి మాట్లాడుతూ కార్తీక పవిత్ర మాసంలో గోవర్ధన హారతి చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత,సంపుర్ణ ఆరోగ్యం,భగవత్ చింతన, సత్ప్రవర్తన,కీర్తి ప్రతిష్టలు, వైబవం , లభిస్తుందని తెలిపిరు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల తో హరే కృష్ణ మహా మంత్రాన్ని హిందూ పవిత్ర గ్రంధం అయిన బగవధ్గీత  శ్లోకాలను తప్పనిసరి పారాయణం చేయాలని వారు సూచించారు. ఇ కార్యక్రమంలో   రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డి జే దయానంద్ హేమలత దంపతులు,  చైర్మన్ పండిత్ వినిత పవన్ ,కౌన్సిలర్ అల్జపూర్ రేవతి, ఏసు ఏసు కే సమాజ్ అధ్యక్షులు,అంతాజీ మధన్ మోహన్ ,రెడ్డి ప్రకాష్, కార్యదర్శి  బరాడ్ గంగామోహన్ ,ఇస్కాన్ ప్రబుజి అదిపురుష , భక్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love