టీ హబ్, టీ వర్క్స్ లకు సీఈఓలను నియమించిన ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్ల ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగుతారు. అయితే టీ వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రం. ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి.. అనే నినాదంతో రూపొందిన టీ వర్క్స్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారింది. ఇక టీ హబ్ అనేది యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన ప్రాజెక్టు. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఇదొక సరికొత్త వేదిక.

 

Spread the love