– దుబ్బాకలో తెలంగాణ మహిళా సంక్షేమ సంబరాలు
– నియోజకవర్గానికి రూ.20 కోట్ల చెక్కుపంపిణీ
– మహిళ సంఘాలు ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
– రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావ్
– కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ఏపీఎంలు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని, ప్రభుత్వం అందించే రుణాలను మహిళ సంఘాల సభ్యులు వినియోగించుకుని వారి కుటుంబాలు మరింత ఆర్థిక వృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దుబ్బాక మండల కేంద్రంలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి పంక్షన్ హాల్లో తెలంగాణ మహిళా సంక్షేమ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.మహిళలల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం నుంచి ఎల్లవేళలా సహాయ సహకారాలను మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.మహిళలను సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు. తదనంతరం దుబ్బాక నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన 20 కోట్ల బ్యాంకు రుణాల జంబో చెక్కును మంత్రి హరీష్ రావు,మెదక్ ఎంపీ ,జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఏపీఎంలు సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్ రావ్,మెదక్ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సభాప్రాంగణం అంత బతుకమ్మ పాటలకు మహిళలంతా కలిసి డ్యాన్స్‌లు చేయడంతో కోలాహలంగా మారింది. కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి , డిపిఓ దేవకీదేవి , డిడబ్ల్యు ఓ రాంగోపాల్ రెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ రవీందర్ , జిల్లా &మండల్ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు , నియోజకవర్గ మహిళా సమాఖ్య లీడర్లు వివోఏలు, సీసీలు ,మహిళ ఉద్యోగినులు ఉన్నారు.