పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం: బండి సంజయ్‌

నవతెలంగాణకరీంనగర్‌: గ్రూప్‌ -1 పరీక్షను సరిగ్గా నిర్వహించే సత్తాలేని సర్కారు బీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. యువత భవిష్యత్‌ నాశనమవుతుంటే సీఎం కేసీఆర్‌ నోరెత్తటం లేదన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘రూ.లక్షలు ఖర్చు చేసిన పరీక్షకు సిద్ధమైన వారికీ ఉద్యోగాలపై ఆశ లేకుండా పోయింది. టెన్త్‌, ఇంటర్‌, గ్రూప్‌ -1 సహా అన్ని పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగాలి’’ అని బండి సంజయ్ అన్నారు.

Spread the love