ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వారికి చెల్లించాల్సిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ సొమ్ము, DAలు, PF బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలను ఆర్టీసీ ఉద్యోగులకూ అమలు చేయాలని CMను కోరతామన్నారు. ఇక ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఉద్యోగుల లక్ష్యం కావాలన్నారు.

Spread the love