– విద్యార్థుల సౌకర్యార్థం 11వేల టీచర్ పోస్టుల భర్తీ: ఎమ్మెల్యే
నవతెలంగాణ – రెంజల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని సారించి సుమారు రెండువేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముఖ్యంగా వారికి తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టిని సాధించాలని ప్రిన్సిపల్ బలరాంను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికైనా విద్యార్థులను జిపిఏ 10/10 తీసుకురావాలని లేనట్లయితే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మధ్యమము బోధించడం జరుగుతుందని, విద్యార్థి తల్లిదండ్రు లు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించకుండా ప్రభుత్వ పాఠశాలల చేరేలా వారికి అవగాహన కల్పించా లని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, ఎంపీపీ రజిని కిషోర్, జెడ్పిటిసి మేక విజయ సంతోష్, డి ఆర్ డి ఏ అధికారి సాయ గౌడ్, ఆర్టీవో రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు సాయి రెడ్డి, జావీద్ ఉద్దీన్, సాయిబాబా గడ్, సిహెచ్ రాములు, సురేందర్ గౌడ్, ఎమ్మెస్ రమేష్ కుమార్, గియాసాద్దీన్, కురుమే శ్రీనివాస్, హైమద్ చౌదరి, గంగా కృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.