నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూత

మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఏఆర్‌ మొబైల్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌
సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
నేటి సమాజంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్‌ పల్లి మున్సిపాలిటీ జల్‌పల్లి గ్రామంలో గురువారం ఏఆర్‌ గ్రూప్‌ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఏఆర్‌ మొబైల్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జల్‌పల్లిలోని రోడ్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జల్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్‌ బిన్‌ ఖలీఫా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యంజాల జనార్ధన్‌, కౌన్సిలర్లు శంషుద్దీన్‌, లక్ష్మీనారాయణ, కో ఆప్షన్‌ సభ్యుడు సూరెడ్డి కష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు షేక్‌ జహంగీర్‌, సయిద్‌ పటేల్‌, సూరెడ్డి సత్తిరెడ్డి, పోలేమోని నాగేష్‌ ముదిరాజ్‌, యంజాల అర్జున్‌, షేక్‌ జహీరుద్దీన్‌, సయిద్‌ ఇంద్రిస్‌ మల్లికార్జున్‌, నవాజ్‌ భారు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love