చేపల పెంపకంకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

– జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
చేపల పెంపకంకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని, అక్వ సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధ రెడ్డి తెలిపారు. గురువారం బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో జాతీయ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళ సంఘం ఆధ్వర్యంలో చేపల పెంపకం చెరువును జిల్లా డిఆర్డీఏ ఎపిఓ ,రాం నారాయన్, డిపిఎం రమేష్ బాబు, ఎంపీపీ రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి రఘు, మాజీ జడ్పిటిసి సతీష్ మాట్లాడుతూ రైతులు సంప్రదాయపంటలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణా ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధ రెడ్డి మాట్లాడుతూ.. చేప పిల్లల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి లాభాలు పొందవచ్చు. రోజుకు ఉదయం ఒక గంట, సాయంత్రం మరో గంట పాటు వాటి సంరక్షణకు కేటాయించి మిగతా పనులను కూడా చూసుకోవచ్చు. చేప పిల్లలకు ప్రతి రోజూ దాణా అందేలా చూసుకోవాలి. ఆప్పుడప్పుడు వాటి కదలికలను గమనిస్తూ ఉండాలి. చేపల పెంపకం పై కిష్టాపూర్ గ్రామ డ్వాక్రా మహిళలు చేపల పెంపకంకు ముందుకు రావడంపై జిల్లా అధికారులు అభినందించారు. ఈ గ్రామ మహిళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెన్ బాబురావు, వైస్ ఎంపిపి కాశీరం, కిష్టాపూర్ ఎంపీటీసీ భారతి, అన్నారం , కిష్టారెడ్డి సర్పంచ్ లు అంబయ్య, కిష్టారెడ్డి, బీర్కూర్ ఎంపీటీసీ సందీప్, మండల కో ఆప్షన్ మెంబెర్ ఆరీఫ్, ఎంపీడీఓలు బానుప్రకాష్ సుబ్రమణ్యం, బిచ్కుంద, మద్నూర్ ఎంపీడీఓ, అంకోల్ క్యాంప్ సర్పంచ్ రాము, ఏపీఎం గంగారాం, ఐకెపి సిబ్బందిని తదితరులు హాజరయ్యారు.

Spread the love