ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
మహిళలకు తెలంగాణ ప్రభు త్వం పెద్ద పీట వేస్తుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళ వారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని క్రౌన్ ఫం క్షన్ హాల్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా మహిళల సంక్షేమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ మహి ళలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అభివద్ధి కోసం పాటు పడుతుందని, తెలంగాణ పోలీసు వ్యవస్థ, మహిళ భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మాతా శిశు సంక్షేమానికి విప్లవా త్మాక పథకాలు తీసుకువచ్చారన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలను బలోపేతం కోసం ప్రభుత్వం తోడ్పాటు నందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణుగోపాలు, ఎమ్మార్వో సిహెచ్ లలిత, ఏఎంహెచ్వో డాక్టర్ జ్యోతిబారు, సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష ఓం ప్రకాష్ యాదవ్, వివిధ శాఖల అధికారులు తదితర నాయకులు పాల్గొన్నారు.