అడవుల సంరక్షణకు ప్రభుత్వం కషి

నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభు త్వం అడవుల సంరక్షణకు ఎంతో కషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో ఉన్న పహాడి షరీఫ్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను గురువారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడవులతో వాతావరణ కాలుష్య నియంత్రణ జరుగుతుందని చెప్పారు. పార్కుకు సంబంధించిన అభివద్ధితో పాటు ప్రజ లకు వాకింగ్‌ ట్రాక్‌ కోసం మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశిం చారు. జల్‌ పల్లి అర్బన్‌ పార్క్‌లో ఉదయం, సాయంత్రం పూట స్థానికులు వాకింగ్‌ చేసేలా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అర్బన్‌ పార్క్‌ లో మున్సిపల్‌ తరుఫున సిబ్బందిగా ఒకరిని నియమించాలని సూచించారు. అంతేకాదు చిన్న పిల్లలు ఆటలు ఆడుకునేలా పరికరాలు కూడా ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం పార్క్‌లో కాలిబాటన తిరు గుతూ చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. మంత్రి వెంట జల్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ బిన్‌ సాధి, మున్సిపల్‌ కమిషనర్‌ వసంత, కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు యూ సుఫ్‌ పటేల్‌, మున్సిపల్‌ అధ్యక్షులు ఎక్బాల్‌ ఖలీ ఫా, కౌన్సిలర్లు శంషాద్దీన్‌ తదితరులు ఉన్నారు.

Spread the love