తెలంగాణ వర్సిటీ పరిణామాలపై ప్రభుత్వ పరిశీలన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)లో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. కొన్ని ఫైళ్లను వర్సిటీ నుంచి ఎత్తుకెళ్తుంటే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారని అన్నారు. కొన్ని అవినీతి, అక్రమాలకు సంబంధించి ఆధారాలున్నాయని, వాటిని ప్రభుత్వానికి పంపించామని వివరించారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చెప్పారు. గవర్నర్‌, వర్సిటీల చాన్సలర్‌కు వీసీని తొలగించే అధికారముందన్నారు. అయితే ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉంటుందని అన్నారు.

Spread the love