బీఆర్ఎస్ నాయకులకే ప్రభుత్వ పథకాల.?

Government schemes for BRS leaders?– సిపిఐ మండల కార్యదర్శి పన్నాల కుమారస్వామి ఆరోపణ
నవ తెలంగాణ- మల్హర్ రావు.
పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహ లక్ష్మీ,దళిత బంధు, బిసిబంధు,ఎస్టీ బందు తదితర సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ నాయకులకేనా.? పేదలకు ఇవ్వరాని ప్రభుత్వాన్ని, అధికారులను మండల సిపిఐ కార్యదర్శి పన్నాల కుమారస్వామి ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మండలంలో ప్రభుత్వ పథకాలను అధికారులు సెలక్షన్ చేయడం లేదని,బిఆర్ఎస్ నాయకులే లంచాలు తీసుకొని బిఆర్ఎస్ కార్యకర్తలకే చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే దళిత,బిసి,గృహలక్ష్మీ పథకాల్లో అనర్హులను గుర్తించి వెంటనే తొలగించి,అర్హులైన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని,అధికారులను డిమాండ్ చేశారు.మండల కేంద్రమైన తాడిచర్లలో గ్రామాల్లో కొందరు బిఆర్ఎస్ నాయకులు చేతివాటం ప్రదర్శించి అనర్హులకే పథకాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించి చేయవలసిన ప్రక్రియను బిఆర్ఎస్ నాయకులే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ బంధువులకు, తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రోసిడింగ్లు ఇప్పించుకుంటు పథకాలు పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.మండల అధికారులు అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి సొంత ఇల్లు లేని నిరుపేదలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఇండ్లు, బిల్డింగ్స్ ఉన్న వారిని అర్హులుగా ప్రకటించారని ఆరోపించారు

Spread the love