ప్రభుత్వం టెట్ నిర్వహించాలి : నిరుద్యోగులు

నవతెలంగాణ – మహాముత్తారం 
డీఎస్సీ నోటిఫికేషన్ ముందు ఎగ్జామ్ నిర్వహించిన  తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరారు. బుధవారం నవ తెలంగాణతో వారు మాట్లాడారు. పదేళ్ల నిరీక్షణ అనంతరం ప్రజా ప్రభుత్వంలో నిర్వహిస్తున్న మెగా డీఎస్సీకి  నోటిఫికేషన్ ముందు టెట్  నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మొన్నటి వరకు రేవంత్  ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని పత్రిక ముఖంగా తెలిపారు. కానీ టెట్  నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది నిరుద్యోగుల్లో నిరాశనే మిగిల్చింది. టెట్ అనంతరమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.
Spread the love