ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ప్రభుత్వం సహాయం అందించాలని మున్నూరు కాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్ మహేందర్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ఇన్చార్జి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వి మహేందర్ కుమారులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు 40 లక్షల మంది పైగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని మున్నూరు కాపులు అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే అన్నారు. అధిక శాతం కూలి నాలి చేసుకుంటూ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఉన్నత విద్యను అభ్యసించలేక, విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో వెనుకబడిపోయి కూలీలుగా మారుతున్నారు అని చెప్పారు. మా  అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం  దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యలు వివరించాలని ఇంచార్జి కలెక్టర్ కోరినట్లు తెలిపారు. ‌మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం దానికి ఐదువేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కేంద్రాలలో, ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు విద్యార్థినీ విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు.కోకాపేటలో మున్నూరు కాపులకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా సరిపోవటం లేదని జనాభా నిష్పత్తి ప్రకారం దానిని రెట్టింపు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Spread the love