వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Government should support flood victims– గోనెపల్లిలో రైతుల నిరసన
నవతెలంగాణ – తాడ్వాయి 
వర్షాలు, వరదలతో నష్టపోయిన పంట,పాడి రైతులకు తక్షణ సహాయం అందించింది, ప్రభుత్వం ఆదుకోవాలని మండలంలోని గోనెపల్లి రైతులు డిమాండ్ చేశారు. వరదలతో నష్టపోయిన రైతులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని, నివేదికలు పంపాల్సిన అధికారులు రావడంలేదని గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని, పేద రైతులు నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకోవడం జరిగిందని ఆవేద నచ్చిందా. ఆర్థికంగా, అనారోగ్యంగా ఇబ్బందులు పడుతూన్నామని, వెంటనే అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ండ్లు కూలిపోయి కొందరు, మరికొందరు పాడి పశువుల సంపద కోల్పోయి, మరికొందరు పంట పొలాలు నీట మునిగి గ్రామంలో ఆందోళన చెందుతున్నామని అన్నారు. సమస్యల నుండి మమ్ములను కాపాడాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, తాసిల్దార్ రవీందర్ కు వినతి పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లబోయిన ముతేష్, పూణెం సుదర్శన్, చింత బాలయ్య, అర్రెం రాజు, ఈసం సుశీల పలువురు రైతులు, గ్రామస్తులు తదితరులు ాల్గొన్నారు.

Spread the love