తరగతి గదిలోనే ఉజ్వల భవితకు పునాది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

– వాణి విద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ – వేములవాడ
ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు బోధించే పాఠాలు భవిష్యత్తు కోసం బాటలు పడతాయి,పిల్లలకు పలక బలపం పట్టించాలి విద్యార్థులకు తరగతి గదిలో ఉజ్వల భవితకు పునాదులు పడతాయని ప్రభుత్వం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్అన్నారు. వేములవాడ పట్టణంలోని వాణి విద్యాలయ హైస్కూల్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా నిర్వహించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు,గత సంవత్సరం పదవ తరగతిలో 10/10 జిపిఏ సాధించిన ఆర్ రుషిత పుష్పగుచ్చాలు అందజేసి పదివేల రూపాయల పారితోషకం అందజేశారు.  అనంతరం  సంస్కృతిక  వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దా పడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయుడు బోధించే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ బి.అనంతరెడ్డి మాట్లాడుతూ వాణి విద్యాలయం 1995లో స్థాపించి ఇప్పటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బన్నాజీ,కరస్పాండెంట్ పిల్లి మహేష్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రస్మ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు బింగి మహేష్,శ్రీనివాసరావు,ప్రిన్సిపల్ బి.రాము, వాణి విద్యాలయం హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love