గొల్ల కురుమ అభివృద్ధి కి ప్రభుత్వ చేయూత

నవతెలంగాణ – నసురుల్లాబాద్
గొల్ల, కురుమల అభివృద్ధి కి ప్రభుత్వం చేయూత నిస్తుందని, గొల్ల, కురుమలకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న రెండవ విడత గొర్రెల పంపిణీ విధి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని డివిజన్ పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో గొల్ల ,కురుమ రెండవ విడత పంపిణీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పశువైద్యాధికారి మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ డీడీలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో గొర్రెల పంపిణీ ఉంటుందని, దానికి లబ్ధిదారులు సన్నద్ధం కావాలని తెలిపారు. అనంతరం లబ్దిదారుల సందేహలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎస్ మారుతి, డాక్టర్ జైపాల్ సింగ్, గొర్రెల పెంపకం మండల అధ్యక్షుడు పీరుగొండ, గ్రామాల అధ్యక్షులు అశోక్, శ్రీనివాస్ , పీరుగొండ, రవి భాస్కర్, శివకుమార్ సిబ్బంది కే తుకారాం, మహబూబ్, మున్వర్ , బాబయ్య తదితరులు పాల్గొన్నారు

Spread the love