– పాలడుగు వెంకటకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
వర్షాలు వరదలు నష్టాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు.
గురువారం మండల కేంద్రంలో వరద ఉధృతికి ఇండ్లు మునిగిపోయిన వరద బాధితులకు దాతల సహాయ సహకారాలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయి ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎటునాగారం వరకు బస్సులను కూడా నడపలేని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందని అన్నారు. భద్రాచలం వాజేడు వెంకటాపురం మణుగూరు గుంటూరు రాజమండ్రి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని రోజులు బస్సులను నిలిపిన సంఘటనలు చరిత్రలో లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేసి బస్సులను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జంపాల చంద్రశేఖర్, సూదిరెడ్డి జయమ్మ, గోపిదాసు రజిత, పులుసం లక్ష్మి, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, కొత్తపల్లి నరేష్, గుండె శరత్ తదితర నాయకులు పాల్గొన్నారు.