
నవతెలంగాణ – అశ్వారావుపేట : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని అందుకు అనుగునంగా ఆయిల్ ఫాం రైతులకు మేలు చేసే కార్యక్రమాలను భవిష్యత్ లో చేపట్టాలని ఆయిల్ఫెడ్ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
హైద్రాబాద్ సచివాలయం లోని ఆయన ఛాంబర్ లో ఆయిల్ ఫెడ్ 2025 క్యాలెండర్ ను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా కు సంస్థ భవిష్యత్ లక్ష్యాలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి,ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,తిరుమలేశ్ రెడ్డి,జున్ను సత్యనారాయణ లు పాల్గొన్నారు.