నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించి గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి ఉన్నత స్థాయి క్రీడలకు ఎదిగే విధంగా ప్రోత్సహించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు.శనివారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సంక్రాంతి క్రీడోత్సవాల సందర్భంగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించి గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేరుకు గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి కనీసం క్రీడా సామాగ్రిని అట్టి మైదానాలలో ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని,కోట్ల రూపాయలు క్రీడా మైదానాల పేరుతో ఖర్చుచేసి గ్రామీణ స్థాయి యువతకు ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.గ్రామాల్లో అనేకమంది నైపుణ్యం కలిగిన యువత ఉన్నారనీ,వారికి గత ప్రభుత్వం నుంచి కనీసం ప్రోత్సాహం లేక వెనుకపడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ స్థాయి యువతను క్రీడలకు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పంతంగి గ్రామ మాజీ సర్పంచ్ చీర్క సంజీవరెడ్డి DYFI గ్రామ శాఖ గైడర్ కడగంచి రాజేష్ DYFI మాజీ నాయకులు బోయ యాదయ్య,SK మదర్,రోడ్డ భగత్ సింగ్,నేరడి మహేష్,నక్క లింగస్వామి,రోడ్డ శివకుమార్,చేకూరి రమేష్, DYFI జిల్లా కమిటీ సభ్యులు రత్నం శ్రీకాంత్ మండల కార్యదర్శి గుడ్డేటి సుర్జిత్ SFI మండల అధ్యక్షులు బర్రె రాజ్ పెరియర్ DYFI గ్రామ శాఖ కార్యదర్శి సుక్క శ్రీకాంత్ అధ్యక్షులు రొడ్డ శ్రీకాంత్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క నాగరాజ్ ఉపాధ్యక్షులు బోయ సాయి కిరణ్, బోయ పృథ్వీరాజ్, SFI గ్రామ శాఖ కార్యదర్శి బోయ నగేష్, సభ్యులు సుక్క రాహుల్,బండి వెంకటేష్, బర్రె సాయికుమార్,బోయ లింగస్వామి, సైదులు,సన్నీ,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.