నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెంకు చెందిన ఉమ్మల సరోజిని, యాట్ల సందీప్ రెడ్డిలను రాజభవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శనివారం అభినందించి, బహుమతులు అందజేసారు. సమాజంలో వెనుకబడిన కొండ రెడ్ల కులస్థులకు ఓటు ప్రాధాన్యత, యువతకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఐటీడీఏ పిఓ బి.రాహుల్ ఆదేశాల మేరకు రెడ్డిగూడెం నుండి ఇద్దరిని పంపడం జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఎంపిక చేసి పంపారు. అశ్వారావుపేట మండలం, రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉమ్మల చిన్న వెంకటరెడ్డి – పద్మ దంపతుల కూతురు సరోజినీ, యాట్ల పోతురెడ్డి – ధనలక్ష్మి దంపతుల తనయుడు సందీప్ రెడ్డి లు వివరించిన తీరుకు రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా వారికి అవార్డు ప్రదానం చేశారని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.