కేసీఆర్ రాజీనామాని ఆమోదించిన గవర్నర్ తమిళి సై

నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడంతో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ తమిళi సాయి కి పంపారు. తాజాగా కేసీఆర్ రాజీనామాకు గవర్నర్ తమిళ్ సై ఆమోదం తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆపధర్మ ముఖ్యమంత్రి కొనసాగాలని గవర్నర్ తమిళి సై కేసీఆర్ ని కోరారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలు సీఎల్పీ సమావేశం తరువాత సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన తరువాత మంచి ముహుర్తం చూసుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే తొలుత రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ రేపు కేవలం గవర్నర్ ను మాత్రమే కలువనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో సీఎల్పీ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఆ అభ్యర్థి ఎవ్వరూ అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున సీఎం అభ్యర్థి ఎవ్వరో వేచి చూడాలి

Spread the love