ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలి: గవర్నర్ తమిళిసై

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేశారు. నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ఓటర్లు అందరూ పాల్గొనాలని గవర్నర్ తమిళసై కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు తమిళ సై. దూర ప్రాంతాల వారు తమ తమ ప్రాంతాలకు చేరుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love