మూడవ శాసనసభకు గవర్నర్‌ ఆమోదం

to the Third Legislature Governor's approval– 119 మంది కొత్త ఎమ్మెల్యేల
– జాబితా ఇచ్చిన సీఈఓ వికాస్‌రాజ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆమోదించారు. దానితోపాటే తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ, మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ గెజిట్‌ను విడుదల చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ గవర్నర్‌ తమిళసైని కలిసి నూతనంగా ఎన్నికైన 119 ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందచేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి, ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రతిష్ట పెంచారంటూ గవర్నర్‌ ఎన్నికల సంఘం అధికారుల్ని అభినందించారు. జాబితాకు గవర్నర్‌ ఆమోదం తెలపగానే, రాష్ట్ర రెండో శాసనసభ రద్దు అయినట్టు ప్రభుత్వ గెజిట్‌ విడుదల అయ్యింది. ఆ వెంటనే నూతన సభ్యులతో మూడో శాసనసభను ఏర్పాటు చేస్తున్నట్టు మరో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Spread the love