మహాత్ముడికి గవర్నర్‌ ఘన నివాళి

Governor's tribute to Mahatmaనవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి, బాపు సమాధి వద్ద సోమవారం గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ను ప్రభుత్వ సీఎస్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కేశవరావు, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, శైలజ రామయ్యర్‌, శ్రీనివాస రాజు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీఆర్వో వెంకటాచారి, ప్రముఖులు, విద్యార్థులు మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Spread the love