పేదరికం నుండి నాలుగు ఉద్యోగులకు ఎంపికైన గోవింద్ పెట్ యువకుడు

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ యువకుడు నిరూపించాడు. మండలం లోని  గోవింద్ పెట్. గ్రామానికి చెందిన ఒక సామాన్యమైన కుటుంబం కటిక పేదరికాన్ని చూసిన తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులను ఉన్నత స్థానంలో చూడాలని వారు కష్టపడి కుమారులను ఉన్నత చదువులు చదివించారు. హాస్టల్లో ఉంటూ కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన సిరిపురం చిన్న సాయన్న, తల్లి లక్ష్మి, వీరికి ఇద్దరు కుమారులు .చిన్ననాటి నుండి గోవింద్ పెట్ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల యందు పదవ తరగతి వరకు చదువుకొని ఇంటర్ ఆర్మూర్ ప్రభుత్వ కాలేజీలో చేరి డిగ్రీ ఎస్ ఎస్ ఆర్ కాలేజీ నిజామాబాద్. లో పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చేరి పీజీ, పీహెచ్, డి. చేసి నాలుగు ఉద్యోగాలను సంపాదించాడు. ఒకటి డిగ్రీ లెక్చరర్, రెండవది జూనియర్ కాలేజ్ లెక్చరర్, మూడవది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, హైదరాబాదులో చదువుతూనే పేపర్ బాయ్ గా క్యాటరింగ్ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో చదువుకు సంబంధించిన బుక్స్ ను కొనుగోలు చేసుకుని కష్టపడి చదివి ఈ ఉద్యోగాలను సాధించాడు గ్రామానికి వస్తే వ్యవసాయ పనులు కూలి పనులు చేసి తల్లిదండ్రులకు సహాయపడేవాడు. అలా కష్టాల నుండి పైకి వచ్చి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అందుకున్నాడు సిరిపురం సురేందర్.
సురేందర్ అన్న సైతం: సురేందర్ అన్న నరేందర్ కూడా కష్టపడి చదివి ప్రస్తుతం డిచ్ పల్లి లోని ఏడవ బెటాలియన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా  2018 బ్యాచ్ )విధులు నిర్వహిస్తున్నాడు .ప్రస్తుతం సురేందర్, తెలంగాణ గురుకుల లెక్చరర్ గా ఉద్యోగానికి ఎన్నికై విధుల లో చేరనున్నారు. ఇలాంటి ఆణిముత్యాలను కన్న తల్లిదండ్రులకు వారి కుమారులకు గోవింద్ పెట్ గ్రామ ప్రజల తరపున వారి స్నేహితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్ ,,సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ తదితరులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
Spread the love