నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3వేలు, 31-100 మంది ఉంటే రూ.6వేలు, 101-250 మంది ఉంటే రూ.8వేలు, 251-500 మంది ఉంటే రూ.12వేలు, 501-750 మంది ఉంటే రూ.15వేలు, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది.