నవతెలంగాణ – హైదరాబాద్ : సరూర్‌నగర్‌లోని అలకానంద ఆస్పత్రి కేంద్రంగా జరిగిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందన్న మంత్రి పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.