మంగలి వృత్తికి ప్రభుత్వం జీఓ ఇవ్వాలి..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మంగలి వృత్తి పనికి ప్రభుత్వ కార్యాలయాలో మంగలి వారే చేసేలా ప్రభుత్వం జీఓ విడుదల చేయాలని నాయి నాయి బ్రాహ్మణ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. హనుమాన్ టెకిడి లోని బీసీ సాధికారత భవన్ లో మంగలి వృత్తికి సంబంధించిన పనులను కేవలం మంగలి కులస్తులు మాత్రమే చేయాలి అని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులతో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాకేష్ నాయి  అధ్యక్షతన లో జరిగింది . ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజ్  మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు ప్రభుత్వం నుండి జీఓ సాధించే విధంగా ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కృషి చేయాలన్నారు. జీవో సాధించుకోవాలని నాయి బ్రాహ్మణులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం నుంచి జీవ సాధించేందుకు కంది సూర్యనారాయణ . బాలరాజు,  సుధాకర్, రాపోలు సుదర్శన్, చేనారం మలేష్ లతో కలిసి అడ్డక్ కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి ప్రభుత్వం జీవో ఇచ్చే విధంగా విచ్చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నాగరాణి, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు రాజేష్ ,  సతీష్ , రాంబాబు, విద్యాసాగర్. యాదగిరి. ధనరాజ్, యాదగిరి, నరసింహ (బాజంత్రి), సురేష్, చెక్రి, నర్సింగ్, సురేష్, ఆనంద్, విఎస్ఆర్ వెంకట్ రమేష్, దుర్గాప్రసాద్ శ్రీకాంత్, రవి, పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ పాల్గొన్నారు.
Spread the love