ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి…

నవతెలంగాణ – నవీపేట్
విద్యా ఉపాధి సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా ఆదివాసీ నాయక పోడ్ కులస్తులు ఎదగాలని సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ అన్నారు మండల కేంద్రంలో ఆదివాసి నాయకుడు కులస్తులతో ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘం మండల నూతన కమిటీని ఎంపిక చేశారు.జిల్లా అధ్యక్షులు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాయిరాం,ప్రధాన కార్యదర్శి మెట్టు గంగాధర్,కోశాధికారి సాయినాథ్,ఉపాధ్యక్షులు కంఠం నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేగాం గంగసాయన్న,జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సయ్య, రమణ, సాయిలు, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love