– 6,603 మంది గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్)ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 6,603 మంది జేపీఎస్‌లు క్రమబద్ధీకరణకు అర్హులుగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆర్థికశాఖ గ్రేడ్-4 పోస్టులను సృష్టిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి నుంచి జేపీఎస్‌లు పంచాయతీ కార్యదర్శులుగా గ్రేడ్-4 హోదాలో పని చేయనున్నారు.